జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ ప్రారంభం .. ఇంటి వద్దే ఫ్రీగా పరీక్షలు , మందులు : వైఎస్ జగన్
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇళ్ల వద్దే 7 రకాల పరీక్షలు నిర్వహిస్తారని జగన్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహిస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతీ డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు కనీసం నెలకు రెండుసార్లు వెళ్లాలన్నారు. డాక్టర్లు గ్రామాలకు వెళ్లడం వల్ల, ఊళ్లలో ఎవరికి ఎలాంటి వ్యాధులు వున్నాయో సులువుగా తెలుస్తుందని సీఎం చెప్పారు. ఇళ్ల వద్దే 7 రకాల పరీక్షలు నిర్వహిస్తారని జగన్ వెల్లడించారు. ఖరీదైన ముందులు కూడా పేదలకు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ప్రతీ ఒక్కరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతీ మండలంలో రెండు పీహెచ్‌సీలు వుండేలా చర్యలు తీసుకుంటామని.. సురక్షక్యాంపుల ద్వారా గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని సీఎం తెలిపారు. ప్రతీ పేదవారికి ఆరోగ్యశ్రీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు. వైద్యం కోసం ఎవరూ ఇబ్బంది పడొద్దనే ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టామని సీఎం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహిస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
Also Read: పాదయాత్రలోనే మీ కష్టాలను చూశా: వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల
ఒక డాక్టర్ పీహెచ్‌సీలో వుంటే, మరో డాక్టర్ అంబులెన్స్‌లో గ్రామాలకు వెళ్తారని జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్న వారికి కూడా ఖరీదైన మందులు అదిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆరోగ్య సమస్యలు వుంటే ఉచితంగా చికిత్స అందిస్తామని.. సురక్ష క్యాంపుల ద్వారా గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని జగన్ తెలిపారు. ప్రతీ గ్రామాన్ని, ప్రతీ ఇంటిని జల్లెడ పడతామని ఆయన వెల్లడించారు. వైద్యం కోసం ఎవరూ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టామని సీఎం పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ భాగస్వాములేనని జగన్ వెల్లడించారు. 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంటిలోనూ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తారని.. ఆరోగ్య సమస్యలు వున్నవారికి సమస్య నయం అయ్యే వరకు తోడుంటామని జగన్ చెప్పారు. అవసరాన్ని బట్టి యూరిన్, బ్లడ్ టెస్టులు కూడా చేస్తారని సీఎం వెల్లడించారు.