Asianet News TeluguAsianet News Telugu

ఫిర్యాదుల స్వీకరణపై శ్రద్ధ పెట్టండి : కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ ఆదేశాలు

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్ నెంబర్లతో బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతి బుధవారం స్పందన వినతులపై జిల్లా కలెక్టర్లు రివ్యూ చేయాలని సీఎం ఆదేశించారు

ap cm ys jagan key orders to district collectors and sps
Author
Amaravati, First Published Aug 23, 2022, 5:49 PM IST

వృద్ధిరేటులో ఏపీ టాప్‌లో నిలవడం సంతోషంగా వుందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అక్టోబర్ తర్వాత ప్రతి నెలలో వెయ్యి గ్రామాల్లో సర్వే చేపడతామన్నారు. 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నెలకొల్పుతామని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే ఉపాధి హామీ, శాశ్వత భూహక్కుపైనా జగన్ అధికారులతో చర్చించారు. అక్టోబర్ నెలాఖరుకు ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్‌లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 

ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణపై పర్యవేక్షణ వుండాలని జగన్ సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్ నెంబర్లతో బోర్డు ఏర్పాటు చేయాలని.. అక్టోబర్ 2 నాటికి గ్రామాల్లో జగనన్న భూహక్కు, భూ రక్ష సర్వే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ , వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని జగన్ సూచించారు. ప్రతి బుధవారం స్పందన వినతులపై జిల్లా కలెక్టర్లు రివ్యూ చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో స్పందనపై సమీక్ష చేయాలన్నారు. 

ALso REad:మేం వచ్చాకే ఏపీలో అదానీ కంపెనీపెట్టుబడులు: విశాఖలో ఏటీసీ టైర్ల కంపెనీని ప్రారంభించిన జగన్

గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల దగ్గరకు ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారని ... ప్రజల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా ప్రాధాన్యతా పనులుగా గుర్తించాలని సీఎం కోరారు. ప్రాధాన్యతా పనుల కోసం ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాలని.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని జగన్ స్పష్టం చేశారు. దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనులకోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు 25న నేతన్న నేస్తం, సెప్టెంబర్‌ 22న వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios