తూర్పుగోదావరి జిల్లాలో రైతుల క్రాప్ హాలీడే‌ ప్రకటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. సమస్యను పరిష్కరించాలని మంత్రి విశ్వరూప్, అధికారులను ఆదేశించారు. రైతులను ఆదుకోవాలని ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

తూర్పుగోదావరి జిల్లాలో రైతుల క్రాప్ హాలీడే ఉద్యమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పంట పొలాల ముంపు సమస్య పరిష్కరించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ముంపునకు గురవుతున్న పంట పొలాలు, మురుగు డ్రైన్‌లను మంత్రి విశ్వరూప్, అధికారులు పరిశీలించారు.

ముంపునకు కారణమైన కోడు డ్రైన్‌ ఆధునికీకరణకు 30 లక్షలు మంజూరు చేశారు. ముమ్మడివరం మండలం ఐనాపురంలో పంట పొలాల ముంపు సమస్య రైతులను వేధిస్తోంది. సుమారు 800 ఎకరాల ఆయకట్టుదారులు వ్యవసాయ పరంగా ఉత్పన్నమవుతున్న పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని పంట విరామాన్ని ప్రకటించారు. ప్రధానంగా డ్రైన్‌లలో పూడిక వల్ల భారీ వర్షాలతో పంటలన్నీ ముంపు బారినపడి పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.