ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపింది. పారదర్శకత కోసమే గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపింది. పారదర్శకత కోసమే గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. అతి త్వరలోనే 51 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో వుంటాయని తెలిపింది. గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.
