సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారంనాడు హంద్రీనీవా  నీటిని 77 చెరువులకు విడుదల చేశారు.  ఈ మేరకు లక్కసాగరం వద్ద పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేశారు.


కర్నూల్: ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారంనాడు  హంద్రీనీవా నీటిని 77 చెరువులకు విడుదల చేశారు. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని లక్కసాగరం  వద్ద  పంప్ హౌస్ ను సీఎం జగన్  ఇవాళ ప్రారంభించారు. డోన్, పత్తికొండ,  ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చెరువులకు  ఈ నీటిని విడుదల చేయనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి  ప్రధాన కాలువ నుండి  తాగు, సాగు నీటిని సరఫరా చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా  10,394 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.రూ. 224 కోట్లతో పంప్ హౌస్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.హంద్రీనీవా ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాలువ నుండి చెరువులకు నీటిని విడుదల చేశారు సీఎం జగన్. జిల్లాలోని 77 చెరువులకు  లక్కసాగరం పంప్ హౌస్ నుండి నీటిని పంప్ చేయనున్నారు. ఈ పంప్ హౌస్ ను  సీఎం జగన్ ఇవాళ పరిశీలించారు. పంపింగ్ కెపాసిటీతో పాటు ఇతర వివరాలను జగన్ కు అధికారులు వివరించారు. లక్కసాగరం  పంప్ హౌస్ నుండి చెరువులకు నీటిని విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని  డోన్ లో నిర్వహించే సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు.జిల్లాలోని  57 గ్రామాలకు   ఈ పంప్ హౌస్ ద్వారా లబ్ది జరగనుంది.