Asianet News TeluguAsianet News Telugu

జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం : ఇది నాకు దేవుడిచ్చిన వరం.. వైయస్‌.జగన్‌

ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వారిని ప్రోత్సహించేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. 

AP CM YS Jagan Inaugurates Jagananna YSR Badugu Vikasam scheme - bsb
Author
Hyderabad, First Published Oct 26, 2020, 2:42 PM IST

ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వారిని ప్రోత్సహించేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. 

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్‌, తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం. 

వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫెసిలిటేషన్‌కార్యక్రమాలను చేపడుతున్నాం. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు... ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి. 

సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. పూర్తి ఫీజు రియింబర్స్‌ మెంట్‌ అమలుచేస్తున్నాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, కుల,మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం. ఆసరా, చేయూత లాంటి పథకాలను ప్రవేశపెట్టాం. 

ఎస్సీ, ఎస్టీలకు  చెందిన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios