వైఎస్ఆర్ మరణంతో పులివెందుల అభివృద్ధి ఆగింది: వైఎస్ జగన్
దేశమంతా పులివెందుల వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
పులివెందుల:తనకు పులివెందుల ప్రజలు ఇచ్చిన మద్దతు, తోడ్పాటును జీవితకాలంలో మర్చిపోలేనని ఏపీ సీఎం జగన్ చెప్పారుకడప జిల్లా పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారంనాడు ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మీరంతా తనను ప్రోత్సహించి వెన్నుతట్టినందునే దేశం మొత్తం పులివెందుల చూడగలిగే చేస్తున్నామన్నారు సీఎం జగన్. మీకు మంచి టీమ్ అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిది పులివెందులేనని సీఎం జగన్ గుర్తు చేశారు.
వైఎస్ఆర్ బతికున్న కాలంలో పులివెందుల అభివృద్ధి పరుగులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత పులివెందులలో అభివృద్ధి కన్పించకుండాపోయిందన్నారు.పులివెందుల అనే పట్టణం మ్యాపులో ఉందా అనే రకంగా వ్యవహరించారని ఆయన ఆనాటి పాలకులపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైఎస్ మాదిరిగా పులివెందుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. ఎంఐజీ వెంచర్స్ తో వచ్చే ఆదాయం మున్సిపాలిటీ అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు.