ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేలోపు బదిలీలు చేపట్టాలని సీఎం విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలల నిర్మాణాల్లో నాణ్యత ఉండేలా చూడాలని జగన్ సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటించాలని.. స్కూళ్లలో ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలను నాడు-నేడు కార్యక్రమంలో చర్చించారు.

విద్యార్ధుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏఏ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్ధులు ఉన్నారో దానిపై మ్యాపింగ్ చేయాలని సూచించారు.

దీనిపై మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామన్నారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల  బదిలీలు ఉంటాయని, బదిలీల కోసం ఎవరి చుట్టూ చక్కర్లు కొట్టదని మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. స్కూల్స్ ప్రారంభం అయ్యేలోపు బదిలీలు ఉంటాయన్నారు.