ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులకు దీపావళి కానుక ప్రకటించారు. 6,511 పోలీస్ నియామకాలకు ఆయన గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు దీపావళి కానుకను ప్రకటించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా వున్న 6,511 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఏపీ పోలీస్ శాఖలోని సివిల్ , రిజర్వ్ పోలీస్ విభాగాల్లోని 6,511 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 3,580 సివిల్ కానిస్టేబుల్స్, 315 ఎస్సై పోస్టులు వున్నాయి. ఇక రిజర్వ్ పోలీస్ విభాగానికి వస్తే... ఏపీపీఎస్సీలో 2,520 కానిస్టేబుల్ పోస్టులు, 96 ఎస్ఐ పోస్టులు భర్తీ కానున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
