ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు: భీ ఫారాలు అందించిన జగన్


ఎమ్మెల్యే  కోటా  ఎమ్మెల్సీ   కింద  నామినేషన్లు  దాఖలు  చేయనున్న అభ్యర్ధులకు  సీఎం జగన్  భీ ఫారాలు అందించారు.  

 AP CM YS Jagan Gives   Form B  To  MLA Quota  MLC Candidates

అమరావతి:ఎమ్మెల్యే కోటా  కింద  ఎమ్మెల్సీలుగా  నామినేషన్లు దాఖలు  చేయనున్న అభ్యర్ధులకు  ఏపీ  సీఎం వైఎస్ జగన్  గురువారంనాడు భీ ఫారాలు అందించారు.  ఇవాళ ఉదయం  సీఎం క్యాంప్ కార్యాలయానికి  ఎమ్మెల్సీ అభ్యర్ధులు  చేరకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధులకు  సీఎం  జగన్  భీ ఫారాలు అందించారు. 

ఎమ్మెల్యే  కోటా  కింద  పీవీపీ సూర్యనారాయణరాజు,  పోతుల సునీత , కోలా గురువులు , బొమ్మ ఇజ్రాయిల్ , జయమంగళ వెంకటరమణ,  ఏసురత్నం , మర్రి రాజశేఖర్ లకు  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ భీ పారాలు అందించారు. 

ఇవాళ మధ్యాహ్నం  వైసీపీ అభ్యర్ధులు  నామినేషన్లు దాఖలు  చేయనున్నారు.ఎమ్మెల్సీ అభ్యర్ధుల  ఎంపికలో  సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసినట్టుగా  వైసీపీ ప్రకటించింది.  బీసీ, ఎస్సీ,. ఎస్టీ , మైనారిటీలకు  పదవుల పంపకంలో  తమ  పార్టీ పెద్దపీట  వేసిందని   వైసీపీ నేతలు  గుర్తు  చేస్తున్నారు.

నామినేషన్ దాఖలు  చేసిన వైసీపీ అభ్యర్ధులు


సీఎం వద్ద  బీఫారాలు తీసుకున్న తర్వాత  అసెంబ్లీ కార్యాలయానికి  వెళ్లి  వైసీపీ అభ్యర్ధులు  నామినేషన్లు దాఖలు  చేశారు.ఏపీ  రాష్ట్రప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు, అయోధ్య రాంరెడ్డి,  లావు శ్రీకృష్ణదేవరాయ, నందిగం సురేష్,  ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీదేవి  తదితరులు  వెంటరాగా  వైసీపీ అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను  దాఖలు  చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios