రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి నలుగురు అభ్యర్ధులను ఖరారు చేసింది. మంత్రులు మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నాలుగో సీటును రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ నత్వానికి కేటాయించారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

Also Read:రాజ్యసభ ఎన్నికలు: జగన్ తో అంబానీ భేటీ వెనుక రాజకీయం ఇదేనా?

ఏపీ ప్రభుత్వం మండలి రద్దు చేస్తూ తీర్మానం చేయడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు మండలి రద్దయితే ఇద్దరికి ఎలాంటి హోదా ఉండదు. దీంతో వారికి న్యాయం చేసే ఉద్దేశ్యంతో జగన్ ఇరువురిని రాజ్యసభకు పంపుతున్నారు.

ఇక ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విషయానికి వస్తే గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం అయోధ్యకు సీటు దక్కింది.

Also Read:జగన్ నుండి సంకేతాలు... రాజ్యసభకు వెళ్లేది ఆ నలుగురేనా...?

పరిమల్ నత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా స్వయంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తాడేపల్లి వచ్చి జగన్‌ను రిక్వెస్ట్ చేశారు. అంబానీ అంతటివాడు వచ్చి అడగటంతో ఆయన మాట కాదనలేకపోయిన ముఖ్యమంత్రి.. ముఖేశ్ కోరికను తీర్చారు.