పెన్నా కేసు నుండి తన పేరును తొలగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో  మంగళవారం నాడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయమై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడ డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. 


హైదరాబాద్: పెన్నా కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు డిశ్చార్జ్ పిటిషన్ ను దాఖలు చేశారు.సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా చార్జీషీట్ నుండి తన పేరును తొలగించాలని సీఎం జగన్ కోరారు. పెన్నా చార్జీషీట్ నుండి తన పేరును తొలగించాలని జగన్ కోర్టును కోరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదే కేసులో కూడ తన పేరును కూడ తొలగించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. ఈ నెల 22కి ఈ విషయమై విచారణను వాయిదా వేసింది కోర్టు. మరో వైపు ఇదే కేసులో రాజగోపాల్, శ్యామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను కూడ ఈ నెల 22కి వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్ కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది న్యాయస్థానం.