చత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమితులైన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వైసిపి ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. స్వయంగా సీఎం జగన్ విమానాశ్రయానికి విచ్చేసి గవర్నర్ కు పాదాభివందనం చేసి మరీ వీడ్కోలు పలికారు.   

విజయవాడ : చత్తీస్ ఘడ్ గవర్నర్ గా బదిలీ అయిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వైసిపి ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయానికి చేరుకుని గవర్నర్ దంపతులకు సాగనంపారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ కు జగన్ పాదాభివందనం చేసారు. అలాగే పుష్ఫగుచ్చం ఇచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. గవర్నర్ సతీమణితో కూడా జగన్ ఆత్మీయంగా పలకరించారు. గవర్నర్ దంపతులను సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు పలికారు. 

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బిశ్వభూషణ్ దంపతులకు వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయానికి వచ్చారు. దీంతో గన్నవరం విమానాశ్రయంలో సందడి నెలకొంది. అందరూ పుష్పగుచ్చాలు అందిస్తూ గవర్నర్ హోదాలో ఏపీ నుండి వెళ్లిపోతున్న బిశ్వభూషణ్ కు వీడ్కోలు పలికారు. 

గత మూడేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా సేవలందించిన బిశ్వభూషణ్. అప్పుడే అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా గవర్నర్ విధులు నిర్వర్తించారు బిశ్వభూషణ్. దీంతో ఆయనతో మంచి సత్సంబంధాలు కొనసాగించిన వైసిపి ప్రభుత్వం బదిలీ సందర్భంగా గౌరవ వీడ్కోలు పలుకుతోంది. 

Read More ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ కు జగన్ సర్కార్ ఆత్మీయ వీడ్కోలు...(Photos)

మంగళవారం విజయవాడలోని ఎ కన్వెన్షన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ వీడ్కోలు సభ ఏర్పాటుచేసింది వైసిపి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిశ్వభూషన్ ను సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేసారు. అనంతరం సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి గవర్నర్ బిశ్వభూషణ్ ప్రభుత్వం అందించిన విందులో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బాధ్యతల నుండి తప్పుకుని చత్తీస్ ఘడ్ గవర్న్ గా బాధ్యతలు చేపట్టనున్న బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున, తన తరపున అభినందనలతో పాటు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నానని సీఎం జగన్ అన్నారు. ఒక తండ్రిలా , పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి గవర్నర్ బిశ్వభూషన్ అండగా నిలిచారని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి గవర్నర్ సంపూర్ణంగా సహకరించారని సీఎం జగన్ చెప్పారు.

వీడియో 



గవర్నర్ వ్యవస్థకు బిశ్వభూషణ్ హరిచందన్ నిండుతనం తీసుకువచ్చారని సీఎం జగన్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలకు , గవర్నర్ల మధ్య సంబంధాలపై ఇటీవల కాలంలో అనేక వార్తలను చూస్తున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. కానీ, రాష్ట్రంలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉండడానికి బిశ్వభూషణ్ కారణంగా సీఎం అభిప్రాయపడ్డారు.