విద్యార్ధుల భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టే సర్కార్ మాదే: విద్యా కానుక కిట్స్ పంపిణీ చేసిన జగన్

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో జగనన్న విద్యా కానుక పథకం కింద మూడో ఏడాది కిట్స్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. పేదలకు మంచి చదువును అందించాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తుపై పెట్టుబడి పెడుతుందని ఆయన చెప్పారు. 

AP CM YS Jagan Distributes Jgananna Vidya Kanuka Kits In kurnool District

కర్నూల్:విద్యార్ధుల భవిష్యత్తుపై పెట్టుబడి పెడుతున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఏపీ సీఎం YS Jagan చెప్పారు. ఉమ్మడి Kurnool జిల్లాలోని Adoni లోJagananna Vidya Kanuka కింద కిట్స్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.  పేదరికం నుండి బయటపడాలంటే ప్రతి ఇంట్లోనూ చదువులు ఉండాలనేది తమ ప్రభుత్వ అభిమతమన్నారు. అందుకే తాము ఈ పథకాలను తీసుకొచ్చినట్టుగా జగన్ చెప్పారు.  బాగా చదువుకుంటే విద్యార్ధులు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

2020-2021లో జగనన్న విద్యా కానుక పథకానికి రూ. 648 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఆయన చెప్పారు.ఈ నిధులతో 42.34 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కలిగిందన్నారు. 2021-22 లో విద్యా కానుకకు రూ. 789 కోట్లు ఖర్చు చేసినట్టుగా సీఎం చెప్పారు.. 45.71 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది జరిగిందని సీఎం గుర్తు చేశారు.ఈ విద్యా సంవత్సరనం ఈ పథకం కింద రూ. 981 కోట్లను ఖర్చు చేస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు.ఈ నిధులతో 47.4 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది జరుగుతుందన్నారు.

ఈ విద్యా సంవత్సరం నుండి 8వ తరగతిలో అడుగు పెట్టే ప్రతి విద్యార్ధికి ట్యాబ్ ను అందించనున్నట్టుగా సీఎం ప్రకటించారు.ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది 8వ తరగతిలో చేరే విద్యార్ధులకు ట్యాబ్ ల కొనుగోలు కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 

జగనన్న గోరు ముద్ద పథకం ద్వారా విద్యార్ధులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్నారు. రోజుకో మెనూను విద్యార్ధులకు అందిస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వ స్కూల్స్ రూపు రేఖల్ని మార్చినట్టుగా సీఎం చెప్పారు. నాడు-నేడు పథకం ద్వారా స్కూల్స్ లో అనేక మార్పులు చేర్పులు చేశామన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో విద్యార్ధుల చదువుల విషయంలో మధ్యాహ్న భోజన విషయంలో ఎన్ని నిధులు ఖర్చు చేశారో తమ ప్రభుత్వం ఏ రకంగా విద్యార్ధులపై ఖర్చు చేస్తుందో తేడాను గమనించాలని సీఎం జగన్ కోరారు. 

పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే ఆస్తి చదువు అని సీఎం చెప్పారు. మంచి చదువును పిల్లలకు ఇప్పించడం ద్వారా పేదరికాన్ని జయించవచ్చన్నారు.  పేద విద్యార్ధుల కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకు వచ్చామన్నారు. విద్యార్ధుల కోసం బైజూస్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొందని చెప్పారు. సీబీఎస్ఈ పరీక్షల్లో విద్యార్ధులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి ఈ సంస్థ ఇచ్చే గైడెన్స్ కూడా సహకరించనుందన్నారు. మరో వైపు విద్యార్ధులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు కూడా అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు. మరో వైపు స్థానిక ఎమ్మెల్యేల తమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.

also read:పురుగులు పట్టిన మాంసం విక్రయం: విజయవాడలో ఓబేశ్వరరావు అరెస్ట్

బడుగ జంగాలకు ఎస్పీ సర్టిపికెట్ల జారీ విషయమై ఏకసభ్య కమిషన్ నివేదకను కేంద్రానికి పంపామన్నారు. బోయ సామాజిక వర్గానికి చెందిన సర్ఠిపికెట్ల విషయమై కూడా ఇదే రకమైన పరిస్థితి ఉందని ఆయన వివరించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios