శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. అలాగే 30 వ తేదీన జరగనున్న జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో జగన్ పాల్గొంటారు. 

రేపు దేశ రాజధాని ఢిల్లీకి (jagan delhi tour) వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో ప్రధాని మోడీతో (narendra modi) భేటీ కానున్నారు సీఎం జగన్ . అలాగే 30 వ తేదీన జరగనున్న జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో (judicial infrastructure summit) పాల్గొననున్నారు ముఖ్యమంత్రి . ఈ సమావేశానికి ప్రధాని, సీజేఐ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై సెమినార్ జరగనుంది.

కాగా.. ఇటీవల కూడా ముఖ్యమంత్రి జగన్ హస్తినకు వెళ్లారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటూ పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఆయన చర్చించారు. పోలవరం, విభజన సమస్యలతో పాటూ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపైనా ప్రస్తావించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.