Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జయంతి ఇక రైతు దినోత్సవం: ప్రకటించిన జగన్

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

ap cm ys jagan declared ys rajasekhara reddy as jayanthi farmers day
Author
Amaravathi, First Published Jun 25, 2019, 11:21 AM IST

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏటా వైఎస్ జయంతి అయిన జూలై 8వ తేదీన రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు.

అలాగే పంటల భీమా, రైతులకు వడ్డీ లేని రుణం తదితరాలకు సంబంధించిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు పండుగలా నిర్వహించాలని సూచించారు.

వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడిని అక్టోబర్ 15వ తేదీన రాష్ట్రమంతా ఒకే రోజు చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ రోజు ప్రతి రైతు కుటుంబానికి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని జగన్ అధికారులను ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios