Asianet News TeluguAsianet News Telugu

గతంలోలాగా మెలికల్లేవు.. పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు : అసెంబ్లీలో సీఎం జగన్‌

ఆరోగ్య (aarogyasri) అసరా ద్వారా నెలకు 5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan mohan reddy).  కోవిడ్ మహమ్మారి వలన ప్రజలు నష్టపోకూడదని కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చిన ఘనత మనదేనని సీఎం అన్నారు.  కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలొచ్చినా దానిని కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చామని.. ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్ సర్వే చేశామని, 31 సార్లు వెళ్లి మరీ వాకబు చేశారని జగన్ గుర్తుచేశారు

ap cm ys jagan comments on aarogyasri in assembly
Author
Amaravati, First Published Nov 25, 2021, 4:41 PM IST

ఆరోగ్య (aarogyasri) అసరా ద్వారా నెలకు 5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan mohan reddy).  ఆరోగ్యశ్రీపై అసెంబ్లీలో గురువారం ఆయన ప్రసంగిస్తూ .. పిల్లల కోసం తిరుపతిలో (tirupati) హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామని జగన్ గుర్తుచేశారు. కోవిడ్ మహమ్మారి వలన ప్రజలు నష్టపోకూడదని కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చిన ఘనత మనదేనని సీఎం అన్నారు.  కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలొచ్చినా దానిని కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చామని.. ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్ సర్వే చేశామని, 31 సార్లు వెళ్లి మరీ వాకబు చేశారని జగన్ గుర్తుచేశారు. నవంబర్ 23 నాటికి 3 కోట్ల 2 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేశామని సీఎం తెలిపారు. 

కోవిడ్ పరీక్షలు (covid tests) అత్యధికంగా చేసిన రాష్ట్రాలలో మనది ఒకటని.. కోవిడ్ వలన చనిపోయింది .07 శాతం మాత్రమేనని ఆయన అన్నారు. కోవిడ్ వచ్చినా 93 శాతం మందిని కాపాడుకున్నామని.. రాష్ట్ర జనాభాలో మొదటి డోస్‌ను 3 కోట్ల 41 లక్షల 59 వేల మంది తీసుకున్నారని జగన్ తెలిపారు. 2 కోట్ల 39 లక్షలు మంది  రెండవ డోస్ తీసుకున్నారని.. డిసెంబర్ నాటికి 18 సంవత్సరాల పై బడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తి చేస్తామని.. మార్చి నాటికి రెండవ డోస్ పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

Also Read:టాలీవుడ్‌కు జగన్ స్ట్రోక్: బెనిఫిట్ షోలు రద్దు, ఇకపై నాలుగు ఆటలే.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

మనిషిని బ్రతికించాలనే తపన మా ప్రభుత్వానిదన్న ఆయన.. ఎలకలు కొరికి పిల్లలు చనిపోయే పరిస్ధితి గతంలో చూశామంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాసుపత్రులలో గతంలో మందులు వేసుకోవాలంటేనే భయపడేవారు... ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని సీఎం అన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని.. రెండున్నరేళ్ల క్రితం ఎపి లో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడెలా ఉన్నాయో చూడాలని సభ్యులకు జగన్ తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీని 5 లక్షలకు పెంచామని... ఏపీలో 90 శాతం మందికి ఆరోగ్య శ్రీ కింద సాయం అందుతుందని సీఎం వెల్లడించారు. 

పొరుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు వెల్లినా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపచేస్తున్నామని.. ఆరోగ్య శ్రీ ని ఎలా కత్తిరించాలి అనేదానిపై గత ప్రభుత్వం ఉందంటూ జగన్ దుయ్యబట్టారు. రెండున్నర లక్షలు దాటగానే వైద్యం ఆపేసే రోజులు గతంలో వున్నాయన్నారు. ప్రస్తుతం 5 లక్షల దాటినా వైద్యం అందిస్తున్నామని.. మనిషికి ఎంత కావాల్సి వస్తే అంత వైద్యం అందిస్తున్నామని, ఎక్కడా కత్తిరింపులు అనేవే లేవని జగన్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అనేది ఒక విప్లవమని.. ఇప్పటివరకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీకి 4 వేల కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. 

గత ప్రభుత్వ బిల్లులు కూడా మేమే చెల్లించామని.. 1059 వైద్య సేవలుండే ఆరోగ్య శ్రీని 2500 కు పైగా వైద్య సేవలను పెంచి వైద్యం అందిస్తున్నామని జగన్ చెప్పారు. గతంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ ఉండేవి..ప్రస్తుతం మరో 16 టిచింగ్ హాస్పిటల్స్ రానున్నాయన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టబోతున్నామని.. గ్రామస్ధాయి నుంచి వైఎస్ ఆర్ విలేజ్ కు శ్రీకారం చుట్టామని జగన్ తెలిపారు. నాడు నేడు ద్వారా అన్ని హాస్పిటల్స్‌ను 16,250 కోట్లతో అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. 9712 పోస్టులు రిక్రూట్ చేసుకున్నామని...11 వేల పోస్టులను భర్తీ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. మరో 14,786 పోస్టులు పిబ్రవరి లోపు భర్తీ చేయబోతున్నామని.. వైద్య రంగంలో 60 వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని వైఎస్ జగన్ ప్రకటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios