కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ముఖ్య మంత్రి మీడియాతో మాట్లాడారు.

విభజన చట్టంలోని హామీలపై అమిత్‌షాతో చర్చించినట్లుగా తెలిపారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతానని.. ఈ సందర్భంగా విభజనకు సంబంధించిన హామీల అమలు గురించి అడుగుతానన్నారు.

డిప్యూటీ స్పీకర్‌ పదవిపై ఎలాంటి ప్రచారాలు చేయొద్దని సీఎం మీడియాకు సూచించారు. ఏపీకి న్యాయం చేయాలని ప్రధానికి చెప్పాల్సిందిగా తాను అమిత్ షాను కోరానని జగన్ తెలిపారు. ప్రత్యేకహోదా వచ్చే వరకు అడుగుతూనే ఉంటానని సీఎం పేర్కొన్నారు.