Asianet News TeluguAsianet News Telugu

జగన్ కొత్త విధానం: ఏపీలో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, జిల్లాలవారీగా ఇలా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. మంత్రులు వేణుగోపాల్, సుచరిత ఆ జాబితాను ప్రకటించారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

AP CM YS jagan clears 135 nominated post, Women get major quota
Author
Amaravati, First Published Jul 17, 2021, 12:45 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. 135 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరించింది. జోడు పదవులకు స్వస్తి చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవులను తొలగించారు. 

మొత్తం 135 నామినేటెడ్ పోస్టుల్లో 68 పోస్టులు మహిళలకు, 67 పోస్టులు పురుషులకు కేటాయించారు. 76 పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించారు. నామినేటెడ్ పదవులు అలంకార ప్రాయం కాదని, పదవులు పొందినవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. 

జిల్లాలవారీగా పోస్టుల భర్తీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి...

గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6

తూ.గో జిల్లాలో 17 పోస్టుల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9

ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లో
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5

కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6

అనంతపురం జిల్లాలో 10 పోస్టులకు..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5

విశాఖ జిల్లాలో 10 పదవుల్లో..
5 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు

చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 7

ప.గో జిల్లాలో 12 పదవుల్లో..
ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు 6

శ్రీకాకుళం జిల్లా 7 పోస్టుల్లో..
ఎస్సీ ఎస్టీ , బీసీలకు 6

కడప జిల్లా 11 పోస్టుల్లో
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6

కర్నూలు జిల్లాలో 10 పోస్టుల్లో
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5

Follow Us:
Download App:
  • android
  • ios