ప్రకాశం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒంగోలు సామూహిక అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ ఈ ఘటనపై ఎస్పీని అడిగారు. 

అత్యాచార ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు ఒంగోలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీఎం జగన్ కు వెల్లడించారు. నిందితులను త్వరగా పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీని, పోలీస్ సిబ్బందిని సీఎం జగన్ అభినందించారు. 

అనంతరం అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలికకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో బాధితురాలికి రూ.10లక్షలు పరిహారం అందిస్తున్నట్లు సుచరిత వెల్లడించారు. పరిహారం విషయంలో ఉదారంగా ఉ:డాలని జగన్ సూచించారు.