ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను, రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కని వారికి, మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించారు సీఎం.
ఇటీవలే ఏపీ మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) చేపట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) .. ఇక పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. 26 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను , 11 మందిని రీజనల్ కో ఆర్డినేటర్లుగా నియమించారు జగన్. అలాగే వైసీపీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా ఎంపీ విజయసాయిరెడ్డికి (vijayasai reddy) బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) మీడియాకు తెలిపారు.
వైసీపీ జిల్లా అధ్యక్షులు:
- కడప - సురేష్ బాబు
- తిరుపతి - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- ప్రకాశం - బుర్రా మధుసూదన్ యాదవ్
- అన్నమయ్య జిల్లా : శ్రీకాంత్ రెడ్డి
- చిత్తూరు - కేఆర్‌జే భరత్
- అనంతపురం - కాపు రామచంద్రారెడ్డి
- సత్యసాయి - శంకర నారాయణ
- ఎన్టీఆర్ జిల్లా - వెల్లంపల్లి శ్రీనివాస్
- గుంటూరు - మేకతోటి సుచరిత
- కర్నూలు - బాలనాగిరెడ్డి
- నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- బాపట్ల - మోపిదేవి వెంకట రమణ
- నంద్యాల - కాటసాని రాంభూపాల్ రెడ్డి
- కాకినాడ - కన్నబాబు
- పశ్చిమ గోదావరి - రంగనాథ రాజు
- ఏలూరు - ఆళ్ల నాని
- కొనసీమ - పొన్నాడ వెంకట సతీష్
- అనకాపల్లి - కరణం ధర్మశ్రీ
- విశాఖ - అవంతి శ్రీనివాస్
- అల్లూరు సీతారామరాజు - భాగ్యలక్ష్మీ
- పార్వతీపురం - పుష్పశ్రీవాణి
- విజయనగరం - శ్రీనివాసరావు
- శ్రీకాకుళం - ధర్మాన కృష్ణదాస్
- పల్నాడు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
- కృష్ణా - పేర్ని నాని
- తూర్పు గోదావరి - జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు:
- వైఎస్సార్ జిల్లా, తిరుపతి - అనిల్ కుమార్ యాదవ్
- చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ఎన్టీఆర్, కృష్ణా - మర్రి రాజశేఖర్
- ఏలూరు, తూ.గో, ప.గో, కాకినాడ, కోనసీమ - మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్
- విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు - వైవీ సుబ్బారెడ్డి
- పార్వతీపురం మణ్యం, విజయనగరం, శ్రీకాకుళం - బొత్స సత్యనారాయణ
- కర్నూలు, నంద్యాల : సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- నెల్లూరు, బాపట్ల, ప్రకాశం - బాలినేని శ్రీనివాస్ రెడ్డి
- గుంటూరు, పల్నాడు - కొడాలి నాని
