రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. యువ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఇందులో ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి. పార్వతీపురం, పాడేరు జిల్లాలకు ఆయనను ఇన్‌ఛార్జీగా నియమించగా.. మిగిలిన వారందరికీ ఒక్కొక్క జిల్లాను అప్పగించారు సీఎం.
ఇటీవల రాష్ట్రంలో కొత్తగా జిల్లాలను (ap new districts) ఏర్పాటు చేయడం...మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో 26 జిల్లాలకు 25 మంది ఇన్‌ఛార్జ్ మంత్రులను (district incharge ministers) నియమించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) . గుడివాడ అమర్‌నాథ్‌కు పార్వతీపురం, పాడేరు జిల్లాలకు ఇన్‌ఛార్జీగా నియమించగా.. మిగిలిన వారందరికీ ఒక్కొక్క జిల్లాను అప్పగించారు ముఖ్యమంత్రి.
జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులు వీరే:
- కాకినాడ - సిదిరి అప్పలరాజు
- గుంటూరు - ధర్మాన ప్రసాదరావు
- శ్రీకాకుళం - బొత్స సత్యనారాయణ
- అనకాపల్లి - పి . రాజన్నదొర
- పార్వతీపురం, పాడేరు - గుడివాడ అమర్‌నాథ్
- విజయనగరం - ముత్యాలనాయుడు
- పశ్చిమ గోదావరి - దాడిశెట్టి రాజా
- ఏలూరు - విశ్వరూప్
- తూర్పుగోదావరి - చెల్లుబోయిన వేణుగోపాల్
- ఎన్టీఆర్ జిల్లా - తానేటి వనిత
- పల్నాడు - కారుమూరి నాగేశ్వరరావు
- బాపట్ల - కొట్టు సత్యనారాయణ
- అమలాపురం - జోగి రమేశ్
- ఒంగోలు - మేరుగ నాగార్జున
- విశాఖ - విడదల రజనీ
- కృష్ణా - రోజా
- నెల్లూరు - అంబటి రాంబాబు
- కడప - ఆదిమూలపు సురేష్
- అన్నమయ్య - కాకాణి గోవర్థన్ రెడ్డి
- అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- తిరుపతి - నారాయణ స్వామి
- నంద్యాల - అంజాద్ బాషా
- కర్నూలు - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- సత్యసాయి - గుమ్మనూరు జయరాం
- చిత్తూరు - ఉషశ్రీ చరణ్
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన సంగతి తెలిసిందే . 11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. అటు వీరికి మద్ధతుగా అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలు గరం గరంగా వున్నాయి.
