ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బదిలీలకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైల్ మీద జగన్ సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. '

ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ల  ప్రక్రియ జరుగుతుంది. ఏపీలో మూడేళ్లుగా స్థాన చలనం కోసం టీచర్లు ఎదురుచూస్తున్నారు.