తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయిని పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢీల్లీ పయనం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నవాజ్‌పేయిని చంద్రబాబు పరామర్శించనున్నారు. 

అమరావతి: తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయిని పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢీల్లీ పయనం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నవాజ్‌పేయిని చంద్రబాబు పరామర్శించనున్నారు. 
రాజకీయంగా వాజ్ పేయి, చంద్రబాబుల మధ్య మంచి సత్సమ సంబంధాలున్నాయి. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ కన్వీనర్ గా ఉంటూ దేశ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.