ఏపీలో భారీ వర్షాలు: జగన్ పోలవరం టూర్ వాయిదా

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం జగన్ ఈ నెల 14న  పోలవరం టూర్ ప్లాన్ చేసుకొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జగన్ పోలవరం టూర్ ను వాయిదా వేసుకొన్నారు.
 

AP CM Polavaram Visit postpones due to rains lns


అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం టూర్  వాయిదా పడింది.ఈ నెల 14న ఆయన పోలవరం ప్రాజెక్టును పరిశీలించాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. నిర్ణీత గడువులోపుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.  ప్రాజెక్టు పనుల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకుగాను  పోలవరం ప్రాజెక్టు టూర్ ను సీఎం జగన్ ప్లాన్ చేసుకొన్నారు. 

also read:ఈ నెల 14న పోలవరానికి జగన్: ప్రాజెక్టు పనుల పరిశీలన

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 14వ తేదీన ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. దీంతో   సీఎం వైఎస్ జగన్  పోలవరం టూర్ ను వాయిదా వేసుకొన్నారు. 

వచ్చే వారంలో  జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టుకు  కేంద్రం నుండి రావాల్సిన బకాయిల విషయంలో  కూడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ప్రతినిధులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios