భువనేశ్వరీ... నువ్వే నా సర్వస్వం : భార్యకు చంద్రబాబు ఎమోషనల్ భర్త్ డే విషెస్
ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెను కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తూ భర్త్ డే విషెస్ తెలిపారు చంద్రబాబు.
Happy Birthday Nara Bhuvaneshwari : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ... దీన్ని వివిధ సందర్భాల్లో వారు వ్యక్తం చేసారు. తన భార్యను నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఎమోషనల్ అవడం... మీడియా ముందు వెక్కివెక్కి ఏడవడమే భువనేశ్వరిపై ఆయనకు ఎంత ప్రేముందో తెలియజేస్తుంది. ఇక ఎప్పుడూ బయటకురాని భువనేశ్వరి భర్తను జైల్లో పెట్టిన సమయంలో రోడ్డుపైకి వచ్చి పోరాటం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, కోర్టుల్లో కొట్లాడుతూ చంద్రబాబు కోసం ఎంతో తాపత్రయపడ్డారు.ఈ పోరాటం చాలు భువనేశ్వరికి భర్తపై ఎంత ప్రేముందో తెలియజేయడానికి. ఇలా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పరస్పరం ప్రేమానురాగాలు పంచుకుంటూ జీవిస్తున్నారు.
అయితే గత ఐదేళ్ల గడ్డుకాలం ముగిసి చంద్రబాబు-భువనేశ్వరి దంపతుల జీవితంలోకి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. టిడిపి కూటమి అధికారంలోకి రావడం... చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంలో భువనేశ్వరి ఆనందానికి అవధులు లేవు. ఇలాంటి ఆనందభరిత సమయంలోనే ఆమె పుట్టినరోజు వచ్చింది. దీంతో నారావారి కుటుంబంలో ప్రేమానురాగాలు వెల్లివిరిసి మరింత సంతోషాన్ని నింపింది. తన భార్యకు ఎంతో ప్రేమతో భర్త్ డే విషెస్ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.
'నీ ముఖంలో ఈ చిరునవ్వు ఎప్పుడూ వుంటుంది... చీకటి రోజుల్లోనూ ఈ చిరునవ్వును చెదరనివ్వలేవు. ఎల్లపుడూ దృడంగా వుంటూ మద్దతుగా నిలుస్తావు. ప్రజాసేవ చేయాలనే నా తపనను గుర్తించి అందుకోసం 100శాతం సహకారం అందించారు. నా సర్వస్వమా... హ్యాపీ భర్త్ డే'' అంటూ భార్య భువనేశ్వరి హృదయానికి హత్తుకునేలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.
ఇక తన భర్త ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో ఉబ్బితబ్బిబయినట్లున్నారు భువనేశ్వరి. దీంతో భర్త విషెస్ పట్ల కాస్త ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. ''థ్యాక్యూ అండీ. ప్రతిరోజును మరింత బెటర్ గా చేసుకోవడంలో మీరే నాకు స్పూర్తినిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ అనే కుటుంబానికి పెద్దగా మారిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా. ఎల్లపుడూ మీకు మద్దతుగా వుంటారు. మీరే నా సర్వస్వం'' అంటూ ఎక్స్ వేదికన భర్తకు రిప్లై ఇస్తూ ట్వీట్ చేసారు నారా భువనేశ్వరి.
మంత్రి నారా లోకేష్ కూడా తల్లికి భర్త్ డే విషెస్ తెలిపారు. 'హ్యాపీ భర్త్ డే అమ్మా! నీ ప్రేమ, ఆప్యాయతలే నాకు పెద్ద బలం. ప్రజా సేవ, వ్యాపారవేత్తగా, న్యాయం కోసం పోరాడిన మహిళగా... నువ్వు నాకెంతో స్పూర్తినిచ్చావు. రోజురోజుకు మీపై ఆరాధనభావం మరింత పెరుగుతోంది. మీవల్లే మాజీవితాలు ప్రతిరోజు వెలిగిపోతున్నాయి. మీరు ఎల్లపుడూ ఇలాగా వెలిగిపోతుండాలి అమ్మా'' అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.