అమరావతి:జాతీయ పతాకా రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు లేఖ రాశారు. ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మాచర్లలో సీఎం జగన్ పింగళి వెంకయ్య కూతురు సీతామహలక్ష్మిని సన్మానించారు.

also read:పింగళి వెంకయ్య కూతురిని సన్మానించిన సీఎం జగన్

ఈ సందర్భంగా తన తండ్రికి భారతరత్న ఇవ్వాలని సీతా మహలక్ష్మి  సీఎం జగన్ ను కోరారు. కుటుంబసభ్యులు కూడ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.మాచర్ల నుండి తాడేపల్లికి చేరుకొన్న సీఎం ప్రధాని మోడీకి ఈ విషయమై లేఖ రాశారు. ఈ సమయంలో పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వడం సముచితంగా భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
 

ఆజాదీకా మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారిని స్మరించుకొంటున్న తరుణంలో పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్  ముందుకు వచ్చింది. ఈ డిమాండ్ పై ప్రధానికి ఆయన లేఖ రాశారు.