Asianet News TeluguAsianet News Telugu

నివర్‌ తుపాన్‌ : చనిపోయినవారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

నివర్ తుఫాన్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంటనష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వరద నష్టంపై సమీక్షా సమావేశం జరిపారు.

AP CM Jagan announces ex gratia of 5 Lacks each to families of deceased in Nivar Toofan - bsb
Author
Hyderabad, First Published Nov 28, 2020, 3:16 PM IST

నివర్ తుఫాన్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంటనష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వరద నష్టంపై సమీక్షా సమావేశం జరిపారు.

సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంటనష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతిఒక్క వరద బాధితుడిని మానవతాధృక్పథంతో చూడాలని అన్నారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. 

అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతిఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. 

కాగా నివర్‌ తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్‌ శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తుపాను ప్రభావిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు. నష్టపోయిన రైతులను అదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios