'బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం' సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానం దక్కింది. టాప్ టెన్ లిస్ట్ లో అత్యంత వేగంగా సీనియర్ పొలిటీషియన్స్ కంటే ముందు జాబితాలో జగన్ కి బెస్ట్ సీఎంగా గుర్తింపు దక్కడం విశేషం.  పరిపాలనా ప్రజా సంక్షేమ పథకాల అమలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో పోల్‌ సర్వే నిర్వహించారు.

అయితే టాప్ టెన్ లిస్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి స్థానం దక్కకపోవడం పెద్ద షాక్ అని చెప్పాలి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం పలు సర్వేలలో బెస్ట్ సీఎం గా గుర్తింపు దక్కించుకోవడమే కాకుండా రెండవసారి కూడా అత్యధిక మెజారిటీతో సీఎంగా అధికారం అందుకున్న కేసీఆర్ ఈ సర్వేలో వెనుకబడ్డారు. ఇక బెస్ట్ పెర్ఫామింగ్ ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  4 వ స్థానంలో నిలిచారు.

ఇకపోతే ఈ సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్‌ కూడా పొందుపరిచారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేల టాప్ లిస్ట్ పై ఒక లుక్కేస్తే..

13% తో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ (బీజేపీ)  

11% తో 2వ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఆమ్ ఆద్మీ)

11% తో 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌)  

10% తో 3వ స్థానంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌(జెడియూ)

7% తో నాలుగో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( వైఎస్ఆర్ కాంగ్రెస్ ). 

6% తో 5వ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్).

6%తో 5వ స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ( బిజూ జనతా దళ్ ). 

4% తో 6వ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (బీజేపీ).

3% తో 7వ స్థానంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్).

3%తో 7వ స్థానంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ( బీజేపీ ).