Asianet News TeluguAsianet News Telugu

ఫ్రస్టేషన్ తో జగన్ ఏదిపడితే అది మాట్లాడుతున్నాడు.. చంద్రబాబు

ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. పార్టీ నేతలతంతా  సిద్ధంగా ఉండాలని సూచించారు

ap cm comments on jagan in teleconferencewith party leaders
Author
Hyderabad, First Published Feb 18, 2019, 10:20 AM IST

ఫ్రస్టేషన్ తో జగన్ ఏదీ పడితే అది మాట్లాడుతున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.  సోమవారం చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు కొన్ని సూచనలు చేశారు.

ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. పార్టీ నేతలతంతా  సిద్ధంగా ఉండాలని సూచించారు.  టీడీపీకి వెన్నుదన్ను బీసీలేనని.. ఈ విషయం వైసీపీకి మింగుడుపడటం లేదన్నారు. బీసీ సబ్ ప్లాన్ కి తామే చట్టబద్ధత కల్పించామని.. మళ్లీ చట్టబద్ధత కల్పిస్తామని జగన్ అనడం అవగాహన రాహిత్యమన్నారు.

జయహో బీసీ సభ విజయవంతం కావడం చూసి జగన్ తట్టుకోలేకపోయాడని అభిప్రాయపడ్డారు. జగన్ హడావిడిగా సభ పెట్టి.. ఏదిపడితే అది మాట్లాడి వెళ్లిపోయారని అన్నారు. జగన్ కి కన్నా లక్ష్మీ నారాయణ అద్దె మైక్ అని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో ఉత్తమ బృందాన్ని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. వైఎస్ పాలనలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. తమ ప్రభుత్వ పాలనలో కౌలు రైతులకు భరోసా ఉంటుందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios