వాహనదారులకు చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 10, Sep 2018, 3:18 PM IST
ap cm chandrababu wants to cut off tax price of petrol and diesel
Highlights

పెట్రోల్ పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చమురు ధరలపై పన్ను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఓ వైపు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ.. ఈ రోజు దేశ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు కూడా. కాగా.. ఈ అధిక ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులుపడుతున్న వాహనదారులకు చంద్రబాబు మంచి శుభవార్త తెలియజేశారు.

విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. కాగా పెట్రోల్ పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చమురు ధరలపై పన్ను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

loader