మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంట జరిగిన శుభకార్యానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో ఆదివారం రాజగోపాల్ కుమారుడు హార్మన్ పంచెల వేడుక ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ ఖాన్‌, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య, మేయర్‌ కోనేరు శ్రీధర్‌, గజల్‌ శ్రీనివాస్‌, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, సినీ నిర్మాత బండ్ల గణేష్‌, వైసీపీ నేత అంబటి రాంబాబు, ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, లలితా జువెలరీస్‌ ఎండీ కిరణ్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై హార్మన్‌ను ఆశీర్వదించారు.