Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ చేతుల్లోనే వైఎస్సార్‌సిపి అభ్యర్థుల ఎంపిక: చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి తరపున పోటీచేసే అభ్యర్ధుల ఎంపికను ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్నారని ఏపి సీఎం చంద్రబాబు ఆరోపించారు. వారు సూచించిన అభ్యర్ధులకే వైఎస్సార్‌సిపి టికెట్లు కేటాయించనుందని చంద్రబాబు పేర్కొన్నారు. వీరి  ముగ్గురి మధ్య చాలాకాలంగా లోపాయికారి ఒప్పందం కొనసాగుతోందని... ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఆ  విషయం బయటపడుతోందని చంద్రబాబు వెల్లడించారు. 

ap cm chandrababu teleconference with tdp leaders
Author
Amaravathi, First Published Feb 16, 2019, 10:46 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి తరపున పోటీచేసే అభ్యర్ధుల ఎంపికను ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్నారని ఏపి సీఎం చంద్రబాబు ఆరోపించారు. వారు సూచించిన అభ్యర్ధులకే వైఎస్సార్‌సిపి టికెట్లు కేటాయించనుందని చంద్రబాబు పేర్కొన్నారు. వీరి  ముగ్గురి మధ్య చాలాకాలంగా లోపాయికారి ఒప్పందం కొనసాగుతోందని... ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఆ  విషయం బయటపడుతోందని చంద్రబాబు వెల్లడించారు. 

ఇవాళ ఉదయం తెలుగు దేశం పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్‌సిపితో టీఆర్ఎస్, బిజెపి ల సంబంధం గురించి మాట్లాడారు. రాజకీయాలను జగన్ ఓ వ్యాపారంలా  మార్చారని  చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ పార్టీలో ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చుపెడతారో వారికే టికెట్లిస్తోందన్నారు. 

2014 ఎన్నికల్లో జైలుకు వెళ్లివచ్చిన వారికి సీట్లిచ్చి బోల్తా పడిన వైఎస్సార్‌సిపి....ప్రస్తుత  ఎన్నికల్లో డబ్బున్న వ్యాపారవేత్తలను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆ పార్టీ తరపున నిలకడగా ఒక్క నాయకుడు పోటీ చేయరని అందరూ వన్ టైమ్ ప్లేయర్సేనని చంద్రబాబు అన్నారు. 

ఏపీ అభివృద్ధిని కేసీఆర్‌, మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. అలాంటివారితో ప్రతిపక్ష నేత జగన్ స్నేహం కొనసాగించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వారందరు కలిసి మరోసారి ఏపి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని...ఆ ఆటలను తాను సాగనివ్వడం లేదని తనపై కక్ష కట్టారని చంద్రబాబు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios