కులాల్లో చిచ్చు రేపటానికి వైసీపీ, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. 

అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారని.. కాపు, బలిజ, తెలగ కులాల వాళ్లే అధికంగా ఉన్నారని.. అందుకే ఈడబ్ల్యఎస్ 10శాతం రిజర్వేషన్లలో కాపులకు 5శాతం ఇస్తున్నట్లు తెలిపారు. కాపు రిజర్వేషన్లను వైసీపీ, బీజేపీ నేతలు రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తే.. వైసీపీ, బీజేపీలకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను తొలగింపు ఎంతో ఊరట కలిగిస్తుందని ఆయన అన్నారు.