Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ తో పొత్తుపై తేల్చేసిన చంద్రబాబు

ఈవీఎంల వల్ల ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ap cm chandrababu says no alliance with congress in ap
Author
Delhi, First Published Feb 1, 2019, 8:53 PM IST

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై సీఎం చంద్రబాబు నాయుడు తేల్చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు దేశాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో బీజేపీకి వ్యతిరేక పార్టీలను కలుపుకుపోతున్నామని అందులో భాగంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా ఈవీఎంలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీయేతర నేతల సమావేశంలో ఈవీఎంలపై చర్చించినట్లు తెలిపారు. ప్రజస్వామ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే అంశం పై చర్చించామన్నారు. సబ్ కమిటీ రిపోర్ట్‌పై చర్చించి, ఆమోదించినట్లు తెలిపారు. 

ఈవీఎంల వల్ల ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు రైతాంగం, నిరుద్యోగం, ఉపాధి లేకపోవడమేనని చంద్రబాబు చెప్పారు. 4 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ వృద్ధి కేవలం 2.4 శాతం మాత్రమేనన్నారు. 

రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 
ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. 

సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. దేశాన్ని కాపాడుకోవాలని, అందుకు అందరం కలవాల్సి ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios