మరోసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్  సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదన్నారు.

ఐదు ఎకరాలు ఉన్న రైతుకి సంవత్సరానికి రూ.6వేలు ముష్టి వేస్తున్నారా అని మండిపడ్డారు. బడ్జెట్ లో నిరుద్యోగ సమస్య ఊసే ఎత్తలేదన్నారు. చివరి బడ్జెట్ లో కూడా ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు.

అనంతరం శుక్రవారం ఏపీలో జరిగిన బంద్ గురించి ప్రస్తావించారు.. జేఏసీ బంద్ విజయవంతమైందన్నారు. అన్యాయాన్ని నిలదీసినందుకే ఈ తీవ్ర నిరసనలని ఆక్ష్న అభిప్రాయపడ్డారు. నిన్న శాసనసభలో చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అభివర్ణించారు.

రాష్ట్రంలో 14లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. బీజేపీ వైఫల్యం కారణంగనే దేశంలో నిరుద్యోగ సమ్యల పెరిగిపోయిందని ఆరోపించారు. పేదల జీవితాల్లో మరో సంక్రాంతి పించన్ల పండగని చంద్రబాబు అన్నారు. 54లక్షల మంది పించన్లకు రూ.14వేల కోట్లు, పసుపు కుంకుమ కింద 94లక్షల మహిళలకు రూ.10వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం కోటి 48లక్షల మందితో మమేకమయ్యే పండగ ఇదన్నారు. పింఛన్లు, పసుపు కుంకుమ అనగానే టీడీపీ గుర్తుకురావాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు.