ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నోటిపికేషన్ వెలువడినప్పటి నుండి తీరిక లేకుండా గడిపారు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అభ్యర్థుల ఎంపిక నుండి మంగళవారం ప్రచారం ముగిసేవరకు కుటుంబానికి దూరమైన ఆయనకు ఇప్పుడు కాస్త తీరిక సమయం దొరికింది. దీంతో ఈ సమయం మొత్తాన్ని ఆయన తన కుటుంబంతోనే గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా తన ముద్దుల మనవడు దేవాన్ష్ తో సరదాగా గడుపుతూ ఈ ఎన్నికల టెన్షన్స్ కు దూరంగా వుంటున్నారు.

ఇలా మనవడితో చంద్రబాబు సరదాగా గార్డెన్ లో ఆడుకుంటున్న ఫోటోను నారా లోకేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ''ప్రజా విజయం కోసం అనుక్షణం ప్రజలతో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచార సభలలో పాల్గొన్న @ncbn గారికి, కుటుంబంతో గడిపేందుకు కాస్త తీరిక దొరికింది. ఇదిగో ఇలా తాతామనవళ్ళు ఇద్దరూ సరదా సమయాన్ని గడుపుతున్నారు'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…