Asianet News TeluguAsianet News Telugu

ఫణి తుఫాను... ఒడిశా సీఎంకు చంద్రబాబు ఫోన్

ఫణి తుఫాను ముంచుకొస్తోంది. ఇప్పటికే ఈ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి.  తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రకన్నా కూడా ఒడిశాపై ఎక్కువగా ఉంది.

ap cm chandrababu phone call to odissa cm naveen patnaiak
Author
Hyderabad, First Published May 2, 2019, 2:34 PM IST


ఫణి తుఫాను ముంచుకొస్తోంది. ఇప్పటికే ఈ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి.  తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రకన్నా కూడా ఒడిశాపై ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో గురువారం ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

తుఫాను ముందస్తు చర్యలపై కలెక్టర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తుఫాను శుక్రవారం ఉదయం 10గంటలకు ఒడిశాలోని పూరీని తాకవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దీని గురించి చంద్రబాబు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చించారు.

ఈ మేరకు ఫోన్‌లో మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నవీన్‌కు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తుపాను విపత్తు సమయంలో రూ.30 కోట్ల విలువైన సామగ్రిని ఒడిశాకు పంపించిన విషయాన్ని అధికారులకు గుర్తుచేశారు.

శ్రీకాకుళం జిల్లాపై కూడా తుఫాను ప్రభావం ఉండటంతో... అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాలని  చంద్రబాబు సంబంధిత అధికారులకు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios