ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లింల పవిత్ర పండగైన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త రాష్ట్రానికి మేలు చెయ్యమని అల్లాని వేడుకున్నానని అన్నారు. ఉర్ధూను రెండో భాషగా చెయ్యడం, హజ్ హౌస్ కట్టిన ఘనత టీడీపీదే అని చెప్పుకొచ్చారు. పండుగ బాగా జరుపుకోవాలని 12 లక్షల మందికి రంజాన్‌ తోఫా ఇచ్చామన్నారు. 

మైనారిటీ యువతుల కోసం దుల్హన్ పథంకం తీసుకొచ్చామని, మైనారిటీలకు 25 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.ట్రిపుల్ తలాక్‌పై మొదట గళమెత్తింది టీడీపీనే అని  ఆయన అన్నారు.

టీడీపీ అడ్డు చెప్పడం వల్లే ట్రిపుల్ తలాక్ జేపీసీకి వెళ్ళిందన్నారు. భవిష్యత్‌లో ఆ చట్టం రాకుండా చూసే బాధ్యత తమది అని భరోసా ఇచ్చారు. చట్టం ద్వారా ముస్లింలను విచారించే అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని, ఈ విషయంలో ముస్లింల తరుపున పోరాడుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.