Asianet News TeluguAsianet News Telugu

మోదీ మోసం చేశారు..టీఆర్ఎస్ మాట తప్పిందన్న చంద్రబాబు

ప్రధాని నరేంద్రమోదీ ఏపిని అన్ని విధాలా మోసం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. అసెంబ్లీలో విభజన హామీలు కేంద్రవైఫల్యాలపై చర్చించిన సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీపై మండిపడ్డారు. మోదీకి గుజరాత్ పై ఉన్న ప్రేమలో ఐదో వంతు ఏపీపై ఉంటే చాలన్నారు.

ap cm chandrababu on modi, kcr
Author
Amaravathi, First Published Sep 17, 2018, 6:43 PM IST


అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ ఏపిని అన్ని విధాలా మోసం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. అసెంబ్లీలో విభజన హామీలు కేంద్రవైఫల్యాలపై చర్చించిన సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీపై మండిపడ్డారు. మోదీకి గుజరాత్ పై ఉన్న ప్రేమలో ఐదో వంతు ఏపీపై ఉంటే చాలన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ మట్టి, నీరు ఇచ్చారన్నారు. బీజేపీ నేతలు మోదీకి వంతపాడటం మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని హితవు పలికారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. హైకోర్టును విభజించమంటే సుప్రీంలో కేసులు వేయించారని అలాగే యూసీలు ఇస్తే ఇవ్వలేదని కేంద్రం అబద్ధం చెబుతోందని ఆరోపించారు.  

బీజేపీతో విబేధించినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ దూరం అయ్యిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిన టీఆర్ఎస్ ఆ తర్వాత మాట మార్చిందన్నారు. తెలుగు జాతి కోసం కలిసుందామని ఎన్నోసార్లు టీఆర్ఎస్ పార్టీకి చెప్పానని కానీ పట్టించుకోలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి ఏపీకి నిధులివ్వాలని చెప్పినా కేంద్రం కరుణించలేదన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios