Richest and poorest CMs in India: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోని అత్యంత సంపన్న సీఎం (₹931 కోట్లు), మమతా బెనర్జీ అత్యల్ప ఆస్తులతో చివరి స్థానంలో ఉన్నారు. 30 మంది ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ₹54.42 కోట్లు, మొత్తం ఉమ్మడి ఆస్తులు ₹1,632 కోట్లు.

Richest and poorest CMs in India: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అత్యల్ప ఆస్తులతో చివరి స్థానంలో ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం ( ఆగస్ట్ 22) విడుదల చేసిన నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది. భారతదేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం సంపద రూ.1,630 కోట్లు అనీ, ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లు అని రిపోర్ట్ పేర్కొంది.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నిలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 931 కోట్లకు పైగా ఉంది. రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ నిలిచారు. పేమా ఖండూ మొత్తం ఆస్తి విలువ రూ. 332 కోట్లు. వీరిద్దరు మాత్రమే దేశంలోని 31 ముఖ్యమంత్రుల్లో బిలియనీర్లు అని నివేదిక వెల్లడించింది.

తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాబితాలో చివరిస్థానంలో నిలిచారు. దీదీ ఆస్తులు రూ. 15 లక్షలు మాత్రమే అని 2021 భోవానిపూర్ ఉపఎన్నికల అఫిడవిట్‌ పేర్కొన్నారు. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లు అని నివేదిక చెబుతోంది. 2023-2024లో భారతదేశ తలసరి నికర జాతీయ ఆదాయం సుమారు రూ. 1,85,854 కాగా, ముఖ్యమంత్రి సగటు ఆదాయం రూ. 13,64,310, ఇది భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు ఎక్కువ.

ADR సమన్వయకర్త ఉజ్జయిని హలీమ్ మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న ఎన్నికల ఖర్చులు తక్కువ ఆదాయం ఉన్న అభ్యర్థులకు పోటీ చేయడం మరింత కష్టతరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందనీ, ఎన్నికల ఖర్చులు పెరుగుతున్నాయని, అభ్యర్థి పోటీ చేయడం కష్టం అవుతోందని వ్యాఖ్యానించారు. ఇలా దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు, వారి ఎన్నికల ఖర్చులను సమగ్రంగా విశ్లేషించినట్టు తెలిపారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆస్తి వివరాలు (Chief Ministers Assets):

  • ఆంధ్రప్రదేశ్ – నారా చంద్రబాబు నాయుడు : ₹931.83 కోట్లు
  • అరుణాచల్ ప్రదేశ్ – పేమా ఖండూ : ₹332.56 కోట్లు
  • కర్ణాటక – సిద్ధరామయ్య : ₹51.93 కోట్లు
  • నాగాలాండ్ – నైఫియు రియో : ₹46.95 కోట్లు
  • మధ్యప్రదేశ్ – మోహన్ యాదవ్ : ₹42.04 కోట్లు
  • పాండిచ్చేరి – ఎన్. రంగస్వామి : ₹38.39 కోట్లు

  • తెలంగాణ – అనుముల రేవంత్ రెడ్డి : ₹30.04 కోట్లు
  • జార్ఖండ్ – హేమంత్ సోరెన్ : ₹25.33 కోట్లు
  • అస్సాం – హిమంత బిశ్వ శర్మ : ₹17.27 కోట్లు
  • మేఘాలయ – కాన్రాడ్ సాంగ్మా : ₹14.06 కోట్లు
  • త్రిపుర – మణిక్ సాహా : ₹13.90 కోట్లు
  • మహారాష్ట్ర – దేవేంద్ర ఫడ్నవీస్ : ₹13.27 కోట్లు

  • గోవా – ప్రమోద్ సావంత్ : ₹9.37 కోట్లు
  • తమిళనాడు – ఎం. కె. స్టాలిన్ : ₹8.88 కోట్లు
  • గుజరాత్ – భుపేంద్ర పటేల్ : ₹8.22 కోట్లు
  • హిమాచల్ ప్రదేశ్ – సుఖ్వీందర్ సింగ్ సుఖు : ₹7.81 కోట్లు
  • సిక్కిం – ప్రేమ్ సింగ్ తమాంగ్ : ₹6.69 కోట్లు
  • హర్యానా – నయాబ్ సింగ్ సైని: ₹5.80 కోట్లు

  • ఢిల్లీ – రేఖ గుప్తా : ₹5.31 కోట్లు
  • ఉత్తరాఖండ్ – పుష్కర్ సింగ్ ధామి : ₹4.64 కోట్లు
  • మిజోరాం – లాల్దుహోమా : ₹4.13 కోట్లు
  • చత్తీస్ ఘడ్ – విష్ణు దేవ్ సాయి : ₹3.80 కోట్లు
  • ఒడిశా – మోహన్ చరణ్ మాఝీ : ₹1.97 కోట్లు
  • బీహార్ – నితీశ్ కుమార్ : ₹1.64 కోట్లు

  • ఉత్తరప్రదేశ్ – యోగి ఆదిత్యనాథ్ : ₹1.54 కోట్లు
  • రాజస్థాన్ – భజన్ లాల్ శర్మ : ₹1.46 కోట్లు
  • కేరళ – పినరయి విజయన్ : ₹1.18 కోట్లు
  • జమ్మూ & కాశ్మీర్ – ఒమర్ అబ్దుల్లా : ₹0.55 కోట్లు
  • పశ్చిమ బెంగాల్ – మమతా బెనర్జీ : ₹0.15 కోట్లు