రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా సీఎం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ, కేసీఆర్, జగన్‌ల కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో అవంతి ఆస్తులున్నాయని అతన్ని బెదిరించారని చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టే చర్యలను.. ఆ వర్గ నేతలే ఖండించాలని సీఎం సూచించారు. బంధుత్వాలు వేరు.. పార్టీ వేరు అనే స్పూర్తి అందరిలో రావాలన్నారు.