అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏముందని విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేసీఆర్ కేవలం మాటల మనిషే కానీ చేతల మనిషి కాదన్నారు. 

కేసీఆర్ హయాంలో అభివృద్ధి శూన్యం అంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో తాము అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను కూడా కేసీఆర్ అమలు చెయ్యడం లేదన్నారు. కానీ తామేదో చేశామని గొప్పలు మాత్రం చెప్పుకుంటారని  చెప్పుకొచ్చారు.