విభజన చట్టంలోని 14 అంశాల్లో 10 అంశాలను కేంద్రం అమలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ఎవరికి చెవిలో పువ్వు పెడతారని ప్రశ్నించారు. మీ చెవిలో మీరే పువ్వు పెట్టుకుంటున్నారని, మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు.  

అమరావతి: భారతీయ జనతా పార్టీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ తాము ఏదో ఉద్దరించినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విభజన చట్టంలోని 14 అంశాల్లో 10 అంశాలను కేంద్రం అమలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ఎవరికి చెవిలో పువ్వు పెడతారని ప్రశ్నించారు. మీ చెవిలో మీరే పువ్వు పెట్టుకుంటున్నారని, మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. 

బీజేపీది భస్మాసుర హస్తమని, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భార్యనే చూసుకోనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని.. కుటుంబాన్నే చూసుకోనివాడు దేశాన్ని ఏం పాలిస్తాడని కేంద్రమంత్రి గడ్కరీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు.