టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకున్నారు. బెంగళూరు నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు

కుప్పంలో జరుగుతున్న తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం కుటుంబం పాల్గొంటుంది. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి అమ్మవారి విశ్వరూప దర్శన పూజల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు అమరావతికి చేరుకుంటారు.