విభజన చట్టాన్ని అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వ్యవహరిస్తోన్న తీరుకు నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. అక్కడి ఏపీభవన్‌లో ఆయన దీక్ష చేస్తారు.

దీక్షకు ముందు ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని ధర్మపోరాట దీక్షలో పాల్గొంటారు.