Asianet News TeluguAsianet News Telugu

ఇంటింటికి స్మార్ట్ ఫోన్, త్వరలో 1.30 లక్షల ఉద్యోగాలు : చంద్రబాబు

భవిష్యత్ లో ప్రతీ ఇంటికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా దామవరంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు తన 40ఏళ్ల రాజకీయ అనుభవంలో 35 సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఒక్క ఐదేళ్లలో చేసినట్లు చెప్పుకొచ్చారు. 

ap cm chandrababu naidu participates janma bhumi ma uru
Author
Nellore, First Published Jan 11, 2019, 3:37 PM IST

నెల్లూరు: భవిష్యత్ లో ప్రతీ ఇంటికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా దామవరంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు తన 40ఏళ్ల రాజకీయ అనుభవంలో 35 సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఒక్క ఐదేళ్లలో చేసినట్లు చెప్పుకొచ్చారు. 

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు నిర్మాణానికి శంకుస్థాపన చేశానని తెలిపారు. 

రూ.4,500 కోట్లతో రామాయపట్నం పోర్టును నిర్మించి తీరుతానని రెండేళ్లలో ఆ పోర్టును రెడీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండోనేషియాకు చెందిన ఓ కంపెనీ రూ.22వేల కోట్లతో కాగిత పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 భారతదేశంలో ఫారిన్ డైరెక్ట్ అతిపెద్ద ఇన్వెస్టిమెంట్ లలో ఇదొకటి అన్నారు. అదానీ 70వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒకే రోజు లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చయని అలాగే లక్ష 30 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. 

తన పాలనలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చిన్న పొరపాటు కూడా జరగకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా అవినీతికి తావులేకుండా ఉండేందుకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. 

అలాగే త్వరలోనే ఇంటింటికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని దాని వల్ల ఇంటి దగ్గర నుంచే ప్రజలు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చునని చంద్రబాబు తెలిపారు. పేదవారి కోసం, యువత కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం కింద నిరుద్యోగులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. నెలకు వెయ్యి రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios