ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన ఆయన బీజేపీ యేతర కూటమి ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. 

కోల్‌కతాలో ఐక్యతా ర్యాలీ విజయవంతం అయిన అంశంపై కూడా చర్చించారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించబోయే సభపైనా రాహుల్ గాంధీతోనూ చంద్రబాబు చర్చించారు. 

అంతకు ముందు చంద్రబాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయిని కలిశారు. ఫిబ్రవరి 3న  ఏపీ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇకపోతే ఢిల్లీలో బుధవారం బీజేపీ యేతర పార్టీల సమావేశం జరగనుంది.