అమరావతి: టీఆర్ఎస్ పార్టీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులను టీఆర్‌ఎస్‌ పార్టీ వేధిస్తోందని ఆరోపించారు. ఏపీ రాజకీయాల్లో తాము చెప్పినట్టుగా పనిచేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ద్వితీయశ్రేణి టీడీపీ నేతల ఆస్తులపై మోదీ ఐటీ దాడులు చేయిస్తున్నారని ఇది  సరికాదన్నారు.  బెదిరింపులకు తాము భయపడమని ఎదిరించి పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదన్న చంద్రబాబు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోమంటూ వేదాంతం చెప్పుకొచ్చారు. ఆస్తులు పోయినా ఆత్మ గౌరవం కోసం పోరాడతామన్నారు. ఏపీని నాశనం చెయ్యాలనే కుట్రలు చేస్తున్నారని అందుకు ఎన్నో బలహీనతలు ఉన్నా జగన్ ని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్, ఢిల్లీ పాలకులు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.