ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. ఏపీ భవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా వేదిక వద్ద ఆయన దీక్షను ప్రారంభించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కేంద్ర వైఖరికి నిరసనగా చంద్రబాబుతో పాటు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నేతలంతా నల్లచొక్కాలు వేసుకున్నారు. దీక్షకు ముందు సీఎం రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించారు.

రాత్రి 8 గంటల వరకు ముఖ్యమంత్రి దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది ప్రజలు, విద్యార్ధులు హాజరయ్యారు. వివిధ జాతీయ పార్టీల నేతలు సైతం దీక్షకు సంఘీభావంగా చంద్రబాబును కలవనున్నారు.